రేడియో జోష్ తరఫునుండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రారంభమైన కొద్ది కాలంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్న రేడియో జోష్ ఎప్పటికపుడు కొత్త కొత్త కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు రాత్రి 7.30 నుండి 9.30 వరకు ఒక వినూత్న కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. ఫేస్బుక్ లో ప్రాచుర్యం పొందిన పాటల గ్రూప్ "నా చరణం - మీ పల్లవి" సభ్యులతో కలిసి రేడియో జోష్ మీకోసం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. అర్ధం కాలేదా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు NCMP గ్రూపు సభ్యులతో రేడియో జోష్ కలిసి లైవ్ షో నిర్వహిస్తుంది. ఇందులో ఊరికే పాటలు కోరుకోవడం, పాడడం లాంటివి ఉండవు. వేర్వేరు కాన్సెప్టులతో ఆన్లైన్లో, స్టూడియోలో ఉన్న NCMP గ్రూపు సభ్యులు పాల్గొనే వినూత్న కార్యక్రమం ఇది. మీరు కూడా తప్పకుండా వినండి. ఆనందించండి. ఇదే మా ఆహ్వానం..
రేడియో జోష్....మొట్టమొదటి ఆన్లైన్ ఈవెంట్
Read User's Comments(7)
Subscribe to:
Posts (Atom)