ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధన యోగమే ప్రప్తేవ సంకేతి క్షాలికె పలికే కుహు గీతిక గాన సరసి రుధ మాలిక

RSS

రాజన్నతో రేడియో జోష్ (రాజన్న పాటలు)






ప్రారంభమైన కొద్దికాలంలోనే విశేష ప్రజాదరణ పొందుతున్న రేడియో జోష్ అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఇప్పటికైతే రేడియో జోష్ లో తెలుగు, హిందీ బాషల్లో పాటలు వినిపిస్తున్నాము. ముందుముందు కన్నడ, తమిళ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నాము. ఇంతవరకు మేము సమర్పించిన ప్రత్యేక కార్యక్రమాలు మిమ్మల్ని అలరించాయని భావిస్తున్నాం.

ఈ సందర్భంగా మరో శుభవార్త మీతో పంచుకోవాలనుకుంటున్నాం.. .

ఇప్పుడు అందరూ ఏ కొత్త సినిమాకోసం ఎదురుచూస్తున్నారో తెలుసా?? అక్కినేని నాగార్జున నటిస్తూ తన స్వంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున నిర్మిస్తున్న "రాజన్న" డిసెంబర్ నెల 22 వ తేదిన భారతదేశంలో, 23 న విదేశాలలో విడుదల కానున్న "రాజన్న " సినిమాకు రేడియో జోష్ అధికారిక రేడియో చానెల్ గా వ్యవహరించబోతుంది.. రేడియో జోష్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు సంతోషంగానూ, గర్వంగానూ ఉంది..

నాగార్జున, స్నేహ , శ్వేతా మీనన్, బేబీ ఏనీ ఈ చిత్రంలో ముఖ్య తారాగణం. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం చారిత్రాత్మకమైన రజాకార్ల ఉద్యమం ఆధారంగా నిర్మించబడింది..

ఈ సినిమాలోని పాటలన్నీ సంగీత, సాహిత్యపరంగా అద్భుతంగా ఉన్నాయి. మీరు వినండి మరి..











  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

హ్మ్మ్.."రాజన్న" అంటే మా రజన్ననుకోని వచ్చినా..:-)
సినిమానా... మావూరికెప్పుడొస్తుందో చూడాలి.

జ్యోతి said...

భాస్కర్ , మీ ఊర్లో శుక్రవారం వస్తుందంట కదా. పాటలైతే బావున్నాయి సినిమా కూడా బావుంటే బావుండు...

Post a Comment