ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధన యోగమే ప్రప్తేవ సంకేతి క్షాలికె పలికే కుహు గీతిక గాన సరసి రుధ మాలిక

RSS

రేడియో జోష్‌తో బిజినెస్‌మాన్

హలో ఫ్రెండ్స్,, రేడియో జోష్ మరో శుభవార్తతో మీ ముందుకు వస్తుంది. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన , పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా బిజినెస్‌మాన్ కు రేడియో జోష్ ఆన్లైన్ రేడియో భాగస్వామిగా పని చేయబోతుంది. ఈ సినిమా పాటలు రేడియో జోష్ లో వింటూ ఉండండి. అప్పుడపుడు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి.



నిన్న సాయంత్రం మాదాపూర్ లోని శిల్పకళావేదికలో బిజినెస్‌మాన్ ఆడియో విడుదల చాలా వైభవంగా జరిగింది.


ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులెందరో విచ్చేశారు. ఈ సందర్భంగా రేడియో జోష్ MD Rj అగ్ని మహేష్ బాబుతో బిజినెస్‌మాన్ వెబ్సైట్ ఆవిష్కరింపచేసారు. http://princebusinessman.com/




ఈ వెబ్సైట్ లో సినిమాకి సంబంధించిన వివరాలు, విశేషాలు ఉంటాయి. ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాళ బాషలలో జనవరి 11 న విడుదల అవుతుంది.

ఈ కార్యక్రమ విశేషాలు చూస్తారా మరి.....




మరి బిజినెస్‌మాన్ పాటలు ఎలా ఉన్నాయో వినేస్తే ఓ పనైపోతుంది కదా..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

రాజన్నతో రేడియో జోష్ (రాజన్న పాటలు)






ప్రారంభమైన కొద్దికాలంలోనే విశేష ప్రజాదరణ పొందుతున్న రేడియో జోష్ అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఇప్పటికైతే రేడియో జోష్ లో తెలుగు, హిందీ బాషల్లో పాటలు వినిపిస్తున్నాము. ముందుముందు కన్నడ, తమిళ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నాము. ఇంతవరకు మేము సమర్పించిన ప్రత్యేక కార్యక్రమాలు మిమ్మల్ని అలరించాయని భావిస్తున్నాం.

ఈ సందర్భంగా మరో శుభవార్త మీతో పంచుకోవాలనుకుంటున్నాం.. .

ఇప్పుడు అందరూ ఏ కొత్త సినిమాకోసం ఎదురుచూస్తున్నారో తెలుసా?? అక్కినేని నాగార్జున నటిస్తూ తన స్వంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున నిర్మిస్తున్న "రాజన్న" డిసెంబర్ నెల 22 వ తేదిన భారతదేశంలో, 23 న విదేశాలలో విడుదల కానున్న "రాజన్న " సినిమాకు రేడియో జోష్ అధికారిక రేడియో చానెల్ గా వ్యవహరించబోతుంది.. రేడియో జోష్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు సంతోషంగానూ, గర్వంగానూ ఉంది..

నాగార్జున, స్నేహ , శ్వేతా మీనన్, బేబీ ఏనీ ఈ చిత్రంలో ముఖ్య తారాగణం. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం చారిత్రాత్మకమైన రజాకార్ల ఉద్యమం ఆధారంగా నిర్మించబడింది..

ఈ సినిమాలోని పాటలన్నీ సంగీత, సాహిత్యపరంగా అద్భుతంగా ఉన్నాయి. మీరు వినండి మరి..











  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

పెయింట్ స్కేప్స్ లో రేడియో జోష్..

డిసెంబర్ 15 నాడు స్టేట్ గ్యాలరీ మాదాపూర్ లో ప్రారంభమైన పెయింట్ స్కేప్స్ కళాప్రదర్శనకు రేడియో భాగస్వామి ఐన రేడియో జోష్ అందిస్తున్న కొన్ని చిత్రాలు..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

పెయింట్ స్కేప్స్








బాపు బొమ్మలకొలువును విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో ముఖీ మీడియా మరో అద్భుతానికి ముచ్చటపడుతోంది... రాష్ట్రంలో ఎంతో మంది గొప్ప చిత్రకారులు తమ వైవిధ్యభరితమైన బొమ్మలతో గొప్ప కలాఖండాలు సృజించి దేశవిదేశాల్లో ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. వీరందరూ, విడివిడిగానూ ఇతర చిత్రకారులతో కలిసి One Man Shows, Group Artists Showsని నిర్వహిస్తున్నారు. వారిలో ఒక 40 మందిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారి సృజనాత్మకతకు, భావుకతకు ఒక ప్రదర్శన ముఖీమీడియా ఏర్పాటు చేస్తోంది. 4 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్‌లో "పెయింట్ స్కేప్స్ " అనే పేరుతో జరిగే ఈ చిత్రకళోత్సవం చిత్రకళాభిమానులని, చిత్రకారులని అనుసంధానం చేసే ఒక భగీరధ ప్రయత్నం. ఇంతమంది చిత్రకారులు ఆంధ్రప్రదేశ్ నలుమూలలనుండి పాల్గొనబోయే కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకి చెందిన పెద్దలు మరెందరో చిత్రకళాభిమానులు తమ వంతు ప్రోత్సాహాన్ని అందివ్వడానికి సిద్ధంగా వున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ముఖీ మీడియా నిర్వహిస్తున్న ఈ "కలర్ స్కేప్స్" కి విశేష ప్రాచుర్యం కల్పించి జాతి గర్వించదగ్గ ఇటువంటి ఉత్తమ కళాకారుల్ని గౌరవించుకునే సత్సంప్రదాయానికి మీ అండా దండా కావాలని అభ్యర్థిస్తూ..

శివలెంక పావని ప్రసాద్
CEO
ముఖీ మీడియా

Mobile:
9966567449

Office:
08413402251

email: mukhimedia@gmail.com
Website: www.mukhimedia.com

Address:
4 - 3 - 263/p
Opp. KVB Lane
Friends Colony
Manikonda
Hyderabad - 89

ఈ చిత్ర ప్రదర్శనలో పాలు పంచుకుంటున్న కొన్ని అఫురూప చిత్రాలు...










  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

పంజా విలన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ

పంజా సినిమాలో విలన్ గా ప్రధానమైన పాత్ర పోషిస్తున్న అడివి శేష తో స్పెషల్ ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు Rj అగ్ని మరియు Rj కావ్య లతో .. తప్పకుండా వినండి. కాల్ చేసి మీరు కూడా శేష గారితో మాట్లాడండి..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

పంజాతో జోష్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "పంజా" సినిమాకు రేడియో జోష్ అధికారిక రేడియో భాగస్వామిగా నిర్ణయించబడింది. ఈ సినిమాకు పని చేసిన వారితో మీ రేడియో జోష్ లో తరచూ లైవ్ షోలు నిర్వహించబడతాయని సగర్వంగా, సంతోషంగా చెప్పుకుంటున్నాము. ఈ క్రమంలో ముందుగా డిసెంబర్ 4 న పంజా సినిమా నిర్మాత శ్రీమతి నీలిమ రేడియో జోష్ స్టూడియోకు వచ్చారు . నీలిమగారితో లైవ్ షో నిర్వహించినవారు Rj అగ్ని , Rj అంజలి..... ఆవిడతో జరిగిన లైవ్ షో కు మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ అభిమానులు ఎంతోమంది ఈ లైవ్ షోకు కాల్ చేసి నీలిమగారితో మాట్లాడి పంజా సినిమా ముచ్చట్లను తెలుసుకున్నారు.


స్వాగతం నీలిమగారు, నగేష్ గారు,,





పంజా నిర్మాత శ్రీమతి నీలిమ, ఆవిడ శ్రీవారు నగేష్ గారికి స్వాగతం చెప్తున్న Rj అగ్ని..

ముందు ముందు మరి కొందరు పంజా స్టార్ లను మీకోసం తీసుకొస్తుంది మీ రేడియో జోష్..


ప్రపంచవ్యాప్తంగా పంజా రిలీజ్ వివరాలు.....

Panjaa WOrld Wide Overseas Theaters Lsit..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

బాపురే .....రమణీయ చిత్రాలు



మొట్టమొదటి భారతీయ బహుభాషా ఆన్లైన్ రేడియో మీ రేడియో జోష్ ముఖీమీడియోతో సంయుక్తంగా మీకోసం సగర్వంగా సమర్పిస్తుంది బాపురే .. రమణీయచిత్రాలు..

ప్రముఖ చిత్రకారుడు, చలన చిత్ర దర్శకుడు కళాప్రపూర్ణ డా. బాపు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ నెలలోని 15,16,17,18 తేదీలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాదులో రాష్ట్రవ్యాప్త చిత్రకళా ప్రదర్శన నిర్వహింపబడుతుంది.

వివరాలకు కాల్ చేయండి:


9963103399

9866146186

8886117788

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

కృష్ణ చైతన్యతో లైవ్ షో ...


గీత రచయిత కృష్ణ చైతన్యను ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు Rj Avin తో లైవ్ షోలో కలవండి. కాల్ చేసి మాట్లాడండి. మీకు నచ్చిన పాటలను కోరుకోండి..




http://radiojosh.com/

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

Its My Love Story - ముఖాముఖీ

కొద్ది రోజుల క్రింద అంటే 25 th నవంబర్ నాడు ఇటీవలే విడుదలైన Its My Love Story సినిమా దర్శకులు మధుర శ్రీధర్ రెడ్డి గారు, హీరో అరవింద్ మన రేడియో జోష్ స్టూడియోకు వచ్చారు. ఆయనతో ఏర్పాటు చేసిన లైవ్ షో కు సంబంధించిన ఫొటోస్ ఇవిగోండి. శ్రీధర్ గారు, అరవింద్ గారు ఎంతో ఉత్సాహంగా ఈ షోలో పాల్గొని కాలర్స్ తో మాట్లాడుతూ సినిమా వివరాలు, విశేషాలు పాటల గురించి చెప్పారు. అంతే కాదండోయ్.. శ్రీధర్ గారు మిమిక్రీ చేసారు అందులో మన అగ్ని విలన్ అన్నమాట..


Rj అగ్ని , దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి

హలో హలో నేను ఇక్కడ లైవ్ షో చేస్తున్నా బాబు గంటాగి మాట్లాడతాను పెట్టేయ్..

హీరో అరవింద్, Rj కావ్య, Rj సియా

అరవింద్, Rj అగ్ని
హీరో, దర్శకులతో ముఖాముఖీ ..

అగ్ని, శ్రీధర్ సీరియస్ గా వర్కింగ్.
అగ్ని, కావ్య Rjయింగ్
పర్లేదు మైక్ , హెడ్ ఫోన్స్ బానే పని చేస్తున్నాయి . కొత్తవి కదా..:)


ఆల్ ది బెస్ట్ రేడియో జోష్..



Its My Love Story హీరో, దర్శకులతో రేడియో జోష్ టీమ్..

Rj సియా, అరవింద్, Rj అశోక్

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

Rj తో మాట్లాడాలా??

హలో ఫ్రెండ్స్... రేడియో జోష్ ని ఆదరిస్తున్న శ్రేయోభిలాషులందరికి ధాంక్స్..

మీకో గుడ్ న్యూస్. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు its మై లవ్ స్టోరీ హీరో , డైరెక్టర్ తో లైవ్ షో మీకోసం .. Rj అగ్ని, Rj కావ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఎందుకాలస్యం సాయంత్రం వినేయండి, కాల్ చేసి మీరు కూడా మాట్లాడండి. పాటలు వినండి.. మరి ఎలా కాల్ చేయాలంటారా.
ఇదిగో ఇలా..




మాకు కాల్ చేయడానికి మీకు ఎటువంటి ఖర్చు లేదు. ప్రపంచంలో ఎక్కడినుండైనా కంప్యూటర్ నుండే కాల్ చేయొచ్చు. స్కైప్ నుండి కూడా కాల్ చేయొచ్చు. స్కైపి ఐడి ఇది.. Skype id - radiojoshlive అలాగే అమెరికా , లండన్, ఆస్ట్రేలియా నుండి కాల్ చేయడానికి ప్రత్యేకమైన నంబర్లు మీకోసం..



మీ కంప్యూటర్ నుండి ఎలా కాల్ చేయాలో తెలుసుకుందాం.

http://www.radiojosh.com/ .. ఈ అడ్రస్ కు లాగిన్ ఐతే మీకు పైన ఇలా ఆప్షన్ వస్తుంది. అది install చేసుకోండి.

ఈ అప్లికేషన్ మీ సిస్టం లోకి install అవుతుంది.




install అయ్యాక దాన్ని సేవ్ చేసుకోండి. అంటే యిపుడు మీరు ఎప్పుడైనా రేడియో జోష్ కి కాల్ చేయొచ్చు.




మీరు కాల్ చేయాలనుకున్నప్పుడల్లా మీ సిస్టం డెస్క్ టాప్ మీద ఉన్న ఐకాన్ ని క్లిక్ చేయగానే ఇలా లాగిన్ ఆప్షన్ వస్తుంది మీరు క్రియేట్ చేసుకున్న జోష్ వివరాలతో లాగిన్ అవ్వండి.


వెంటనే మీకు అక్కడ ఆన్లైన్లో ఉన్న RJ కనిపిస్తారు. కాల్ చేసి మాట్లాడండి. మీకు నచ్చిన పాటలను కోరుకోండి. అప్పుడప్పుడు వచ్చే అతితులతో మాట్లాడండి. ఇంకెందుకు ఆలస్యం.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

Its My Lovestory - లైవ్ షో బొమ్మలు

హాయ్ ఫ్రెండ్స్..

నిన్న సాయంత్రం Its My Love Story సినిమా హీరో హీరోయిన్లు రాజా,నికిత నారాయణ్ మన రేడియో జోష్ స్టూడియోకి అతిథులుగా వచ్చారు. వారితో జరిగిన ముచ్చట్లతో, పాటలతో, మధ్య మధ్య రీడర్స్ కాల్స్ తో ఆహ్లాదకరంగా సాగిపోయింది. ముందు ముందు ఇలాటి కార్యక్రమాలు మరిన్ని ఉండబోతున్నాయి.. మరి నిన్నటి ఫోటోలు కొన్ని చూద్దామా..

స్వాగతం, సుస్వాగతం నికితా....

ఆర్.జె.కావ్య , నికిత నారాయణ్

ఆర్. జె. అగ్ని, నికిత నారాయణ్
నికిత నారాయణ్ , ఆర్.జె.అశోక్





నికిత, ఆర్.జె.సియా, ఆర్.జె.కావ్య


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS