బాపు బొమ్మలకొలువును విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో ముఖీ మీడియా మరో అద్భుతానికి ముచ్చటపడుతోంది... రాష్ట్రంలో ఎంతో మంది గొప్ప చిత్రకారులు తమ వైవిధ్యభరితమైన బొమ్మలతో గొప్ప కలాఖండాలు సృజించి దేశవిదేశాల్లో ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. వీరందరూ, విడివిడిగానూ ఇతర చిత్రకారులతో కలిసి One Man Shows, Group Artists Showsని నిర్వహిస్తున్నారు. వారిలో ఒక 40 మందిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారి సృజనాత్మకతకు, భావుకతకు ఒక ప్రదర్శన ముఖీమీడియా ఏర్పాటు చేస్తోంది. 4 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్‌లో "పెయింట్ స్కేప్స్ " అనే పేరుతో జరిగే ఈ చిత్రకళోత్సవం చిత్రకళాభిమానులని, చిత్రకారులని అనుసంధానం చేసే ఒక భగీరధ ప్రయత్నం. ఇంతమంది చిత్రకారులు ఆంధ్రప్రదేశ్ నలుమూలలనుండి పాల్గొనబోయే కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకి చెందిన పెద్దలు మరెందరో చిత్రకళాభిమానులు తమ వంతు ప్రోత్సాహాన్ని అందివ్వడానికి సిద్ధంగా వున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ముఖీ మీడియా నిర్వహిస్తున్న ఈ "కలర్ స్కేప్స్" కి విశేష ప్రాచుర్యం కల్పించి జాతి గర్వించదగ్గ ఇటువంటి ఉత్తమ కళాకారుల్ని గౌరవించుకునే సత్సంప్రదాయానికి మీ అండా దండా కావాలని అభ్యర్థిస్తూ..
శివలెంక పావని ప్రసాద్
CEO
ముఖీ మీడియా
Mobile:
9966567449
Office:
08413402251
email: mukhimedia@gmail.com
Website: www.mukhimedia.com
Address:
4 - 3 - 263/p
Opp. KVB Lane
Friends Colony
Manikonda
Hyderabad - 89
ఈ చిత్ర ప్రదర్శనలో పాలు పంచుకుంటున్న కొన్ని అఫురూప చిత్రాలు...
పెయింట్ స్కేప్స్
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
nice!
awesome.........
Post a Comment